ఏడో నిజాం కుమార్తె బషీరున్నిసా బేగం కన్నుమూశారు. 93 ఏళ్ల బషీరున్నిసా బేగం అనారోగ్యం కారణంగా మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంతానంలో బ్రతికున్న ఏకైక వ్యక్తి.. ఆయన కుమార్తె బషీరున్నిసా బేగం.
బషీరున్నిసా బేగం 1927లో జన్మించారు. ఆమెకు అలీ పాషాగా పేరొందిన నావాబ్ కాసిం యార్ జంగ్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె ఉంది. పేరు రషీదున్నిసా బేగం. పురాణీ హవేలీలో నివసిస్తున్నారు. అలీ పాషా 1998లో మరణించారు. బషీరున్నిసా బేగం మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు.