యస్ బ్యాంకులో SBi స్టేక్ 48.21శాతం నుంచి 30శాతానికి వచ్చింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPo) తర్వాత 1255 కోట్ల నుంచి 2505.04 కోట్లకు రూ.2 ఫేస్ వాల్యూతో షేర్లు పెరిగాయి. దీంతో ప్రస్తుతం యస్ బ్యాంకులో SBIకున్న 751.6 కోట్ల షేర్లు మొత్తం కంపెనీ విలువలో 30శాతం. ఫాలో ఇన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా యస్ బ్యాంక్ మొత్తం 15వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జులై15న FPO ఓపెన్ చేసింది. రూ.12-13 మధ్య బాండ్ రేట్ ఫిక్స్ చేసింది. 90శాతం మినిమం FPO పెట్టుకుంది. 93శాతం లక్ష్యం చేరుకుంది. 14,276 కోట్లు సమీకరించింది. మిగిలిన మొత్తాన్ని SBI సమకూర్చింది.