మణిపూర్‌లో ఉగ్రదాడులు మెరుపు దాడి చేశారు. అస్సాం రైఫిల్స్ యూనిట్‌కు చెందిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. అంతేకాకుండా జవాన్లపై కాల్పులకు కూడా దిగారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన రాజధాని ఇంఫాల్ నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందేల్ జిల్లాలో జరిగింది.
చందేల్ జిల్లాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన స్థానిక ఉగ్రవాదులు దాడికి పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. తొలుత ఉగ్రవాదులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఆ తర్వాత వారు జవాన్లపై కాల్పులు జరిపారు. దాడి ఘటన తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి ప్రత్యేక దళాలను పంపించారు.