స్టేట్ బ్యాంకులో ఉద్యోగాలు.. 38510 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి తొలిసారిగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (సీబీఓ) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 9 సర్కిళ్లలో 3850 ఖాళీలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ సర్కిల్ లో 550 ఖాళీలను భర్తీ చేస్తారు. బ్యాంకుల్లో ఆఫీసర్ హోదాలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు..
ఏదో ఒక సర్కిల్ కే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైనవారు సంబంధిత సర్కిల్ లోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
విధుల్లో చేరిన వారికి రూ.23,000 మూల వేతనం చెల్లిస్తారు. అన్ని అలవెన్సులూ కలుపుకుని రూ.40 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు.
పోస్టు : సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 3850. వీటిలో 550 హైదరాబాద్ సర్కిల్ లో ఉన్నాయి.
విద్యార్ఘత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
అనుభవం: ఆగస్టు 1, 2020 నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లేదా గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ స్థాయిలో కనీసం రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకోవాలి.
వయసు: ఆగస్టు 1,2020 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.750. ఇతర వర్గాలవారు ఫీజు చెల్లించనవసరం లేదు.
చివరి తేదీ: ఆగస్టు 16
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా, అవసరమైతే రాత పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://bank.sbi/web/careers, https://www.sbi.co.in/web/careers