తమిళనాడులో ఆగస్టు31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

Update: 2020-07-30 18:09 GMT

తమిళనాడులో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మహమ్మారి వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్‌డౌన్ ను ఆగస్టు 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం ప్రతీ ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ఆగస్టులో కూడా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆగస్టు 2,9,16,23,30వ తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.

అటు, సీఎం పళనిస్వామి మాట్లాడుతూ.. చెన్నై సిటీలో 500కు పైగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీంతో.. 1,45,000 మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. చైన్నైలో 70కి పైగా మొబైల్ ఆసుపత్రులు ప్రారంభించామని.. దీంతో డోర్ టూ డోర్ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,126 మొబైల్ ఆసుపత్రులున్నాయని తెలిపారు.

Similar News