తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రధానంగా కామారెడ్డి, జనగామ, సంగారెడ్డి, మెదక్, కుమ్రం భీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల, జగిత్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. వచ్చే రెండోరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.