యూపీ, కేరళలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లకు ఆగస్టు24న ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మాజీ ఎంపీ బేని ప్రసాద్ వర్మ, ఎంపీ వీరేంద్ర కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు స్థానాలు వారి మరణంతో ఖాళీ అయ్యాయని.. దీంతో వారి ఈ స్థానాలను భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించిట్టు పేర్కొంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు.