300 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన బ్రిటన్

Update: 2020-07-31 15:30 GMT

కరోనాను కట్టడి చేయడం కోసం బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. తాజాగా ఇంపీరియల్ కాలేజ్ అఫ్ లండన్ పరిశోధకులు 300 మందికి ప్రయోగాత్మక కరోనావైరస్ వ్యాక్సిన్ ఇచ్చారు. అంతకుముందు, కూడా ఈ టీకాను కొంతమందిపై పరీక్షించారు. సానుకూల ఫలితాలను పొందిన తరువాత, మరో 300 మందిని ఎంపిక చేసి వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించారు.

ఇందులో కూడా సానుకూల ఫలితాలు గనక వచ్చినట్లయితే ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. కాగా బ్రిటన్ లో ఇప్పటివరకు మూడు మిలియన్లకు పైగా కరోనా సంక్రమణ కేసులు నమోదయ్యాయి. 45 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.

Similar News