సొంత పార్టీకి వ్యతిరేకంగా ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-07-31 16:59 GMT

సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపడుతున్న నూతన విద్యా విధానాన్ని తాను స్వాగతిస్తున్నాని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. పార్టీకి తన అభిప్రాయంతో సంబంధం లేదని అన్నారు. కేంద్ర ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానంపై తమ పార్టీతో తాను విభేదిస్తున్నాని అన్నారు. ఈ విషయంలో ఆమె రాహుల్ గాంధీని క్షమించాలని కోరారు. ‘‘ రాహుల్ గాంధీ గారూ... నన్ను క్షమించాలి. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. నేను రోబోను కాను. కీలు బొమ్మను అసలే కాను. ప్రతి విషయంలోనూ అధిష్ఠానానికి తలూపాల్సిన పని లేదు. ఓ సాధారణ పౌరురాలిగా మన వైఖరి చాలా ధైర్యంతో చెప్పాలి’’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Similar News