ఓ బాలుడికి సైకిల్ బహుకరించిన రాష్ట్రపతి

Update: 2020-07-31 18:16 GMT

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రియాజ్ అనే బాలుడి అభిరుచిని గ్రహించి ఓ సైకిల్ ను బహుకరించారు. రియాజ్ అనే బాలుడు ఢిల్లీలోని తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అయితే, తనకు సైక్లింగ్ అంటే ఇష్టం. ఎప్పటికైనా సైక్లింగ్ లో టాపర్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఆ బాలుడికి సైకిల్ బహుకరించారు. ఎప్పటికైనా సైక్లింగ్‌లో ఉన్నత అనుకున్న స్థాయికి చేరాలని ప్రోత్సహించారు. మరోవైపు ఈ బాలుడు చదువుకుంటూనే.. ఓ హోటళ్లో పనిచేస్తూ.. డబ్బులు సంపాదిస్తూ.. సైక్లింగ్‌ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Similar News