కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం కరోనా బారిన పడ్డారు. ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షలో ఆయనకు పాజిటివ్ గా తేలిందని సోమవారం తెలిపారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలియజేశారు. ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ.. కార్తీ చిదంబరం ఇలా అన్నారు.
'నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సాధారణ లక్షణాలు మాత్రమే ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వైద్యులు ఇచ్చే కరోనా టెస్టులు చేయించుకోవాలి.. అలాగే వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని కోరుతున్నా' అని ట్విటర్‌లో పేర్కొన్నారు.