దేశంలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Update: 2020-08-03 12:59 GMT

దేశం‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. వేలాదిగా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. భారత్ లో‌ కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో మరోసారి రికార్డ్‌ స్థాయిలో 52,972 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటెన్‌ను విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 18,03,695కి చేరింది.

24 గంటల్లో 771 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 38,135 కు చేరింది. ఇక గత 24 గంటల్లో 40,574 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 11,86,203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5,79,357 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Similar News