అయోధ్యలో బుధవారం రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన జరగనున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమం అందరిలో స్నేహం , సోదరభావం తోపాటు భారతదేశం జాతీయ ఐక్యత చాటే సాంస్కృతిక సమ్మేళనంగా నిలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. రాముడు అందరివాడని, అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడంటూ ప్రియాంక ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా దశాబ్దాల గాంధీ కుటుంబ చరిత్రలో రాముడికి బహిరంగ మద్దతు , భక్తిని వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు సంవత్సరం తరువాత, ఆగస్టు 5 న అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. అయోధ్యలో బుధవారం జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.