2019 సివిల్‌ సర్వీసెస్‌‌ ఫలి‌తాల విడుదల

Update: 2020-08-04 15:32 GMT

ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ 2019కి సంబంధించిన తుది‌ ఫలితాలు మంగళవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2019 ఫలితాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. పరీక్షలో ప్రదీప్ సింగ్ అగ్రస్థానంలో ఉండగా..

ఆ తరువాత రెండు, మూడు ర్యాంకులు జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ సాధించారు. మొత్తం 829 మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది.

ఇందులో 304 జనరల్‌, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది ఉన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ మరియు ఇతర కేంద్ర సేవలకు అభ్యర్థుల ఎంపిక కోసం కమిషన్ ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది.

Similar News