కరోనాతో మాజీ ఎంపీ మృతి

Update: 2020-08-08 15:00 GMT

దేశంలో కరోనా మహమ్మారి ప్రతీ రోజు సుమారు వెయ్యి మందిని బలి తీసుకుంటుంది. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన నంది ఎల్లయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించారు. నా పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయన పదిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

కాగా, సీనియర్ నేత అయిన నంది ఎల్లయ్య ఆరుసార్లు లోక్‌సభ ఎంపీగా తెలిపొందారు. ఒకసారి రాజ్యసభకు కూడా ప్రాతినిథ్యం వహించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, నాగర్ కర్నూల్ నియోజక వర్గం నుంచి ఒకసారి లోక్‌సభకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కాగా.. ఆయన మృతిపట్ల పార్టీ వర్గాలు సంతాపం తెలుపుతున్నాయి.

Similar News