మాస్క్ ధరించకపోతే రూ. 1000 జరిమానా

Update: 2020-08-10 18:20 GMT

ప్రభుత్వాలు ఎంత హెచ్చరించినా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. జనం మాత్రం కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండటం లేదు. దీంతో కరోనా విజృంభిస్తుంది. దీంతో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మరోసారి జరిమానాలు పెంచారు. మాస్క్ ధరించని వారికి ప్రస్తుతం ఉన్న రూ. 500 ఉన్న జరీమానాను రూ. 1000 పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ జరిమానాలు ఆగస్టు 11 నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. అయితే, ప్రభుత్వం గతంలో కూడా జరిమానాలు పెంచింది. ముందుగా రూ. 200 నుంచి రూ. 500కు పెంచింది. ఆగస్టు1 నుంచి ఈ జరిమానా అమలులోకి వచ్చించి. కాగా.. తాజాగా మరోసారి జరిమానాలు పెంచారు. ప్రస్తుతం.. గుజరాత్ లో 14,147 కరోనా యాక్టివ్ కేసులుండగా, 54,166 మంది పేషెంట్లు పూర్తి స్వస్థతతో డిశ్చార్చి అయ్యారు. మృతుల సంఖ్య 2,652కు చేరింది.

Similar News