ఓ బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనం అయిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ఈ మంటల్లో ఐదుగురు సజీవదహనం కాగా.. పలువురికి తీవ్రగాయాలైయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ప్రమాదానికి గురైన బస్సు బెంగళూరు నుంచి విజయపుర వెళ్తుంది. ఈ ప్రమాదం జరిగినపుడు బస్సులో 32 మంది ఉన్నట్టు తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపుచేశారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం