భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. వాజ్‌పేయి రెండో వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమానికి, దేశ అభివృద్దికి వాజ్‌పేయి ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు.
కాగా, 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. వాజ్‌పేయి మూడు సార్లు ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 1996, 1998, 1999లో మూడు సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1999 నుంచి 2004 వరకు ఐదేళ్లు పూర్తిగా ప్రధానిగా చేసిన మొదటి కాంగ్రెసేతర ప్రధానిగా పేరుగాంచారు. ప్రధాని అవ్వక ముందు పలు శాఖలకు మంత్రిగా చేశారు.