Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ రాజధాని వ్యాఖ్యలపై దుమారం..!
Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ రాజధాని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. యాంకర్ ప్రదీప్ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యానించారు.;
Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ రాజధాని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. యాంకర్ ప్రదీప్ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ రాజధాని పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాస్ మండిపడ్డారు. అమరావతి రైతులు, ప్రజల మనోభావాలను ప్రదీప్ కించపరిచారని ఆరోపించిన ఆయన.. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఎలా చెపతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదీప్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్‌లోని ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.