BRAHMANI: మీ పక్కన నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది
లోకేశ్‌కు బ్రాహ్మణి జన్మదిన శుభాకాంక్షలు
మంత్రి నారా లోకేశ్ బర్త్ డే సందర్భంగా ఆయన సతీమణి బ్రాహ్మణి విషెస్ తెలిపారు. 'నా బలం, ప్రశాంతత అయిన లోకేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సుదీర్ఘ శ్రమ, త్యాగాలను, నిశ్శబ్దంగా మీరు మోస్తున్న భారాన్ని నేను చూస్తున్నాను. మార్పు తీసుకురావాలన్న మీ నిబద్ధత అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ హడావుడి జీవితంలో ఈ ఏడాదైనా మీకు కాస్త శాంతి లభించాలని కోరుకుంటున్నా. మీ పక్కన నడుస్తున్నందుకు గర్వపడుతున్నా' అన్నారు.
గుంటూరులో ఘనంగా జన్మదిన వేడుకలు
నారా లోకేశ్ జన్మదిన వేడుకలు గుంటూరులో అట్టహాసంగా నిర్వహించారు. ఈ నెల 23న లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) చైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో వినూత్నంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ప్రస్థానానికి అద్దం పట్టేలా వివిధ శకటాలతో గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. లోకేశ్ సాధించిన విజయాలు, ఘనతలు, చేసిన అభివృద్ధి పనులను, మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్‌గా రూపొందిస్తున్న తీరును, పార్టీ శ్రేణులకు భరోసాగా నిలిచిన అంశాలను, 5 లక్షల బీమా వంటి పలు అంశాలతో శకటాలను రూపొందించి గుంటూరులో ప్రదర్శించారు.