CBN: మూడేళ్లలో 17 లక్షల ఇళ్లే లక్ష్యం

2029 జనవరికల్లా ‘హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌’: సీఎం.. పొరపాట్లు జరక్కూడదు.. జాప్యం చేయకూడదు... ప్రతి 3 నెలలకోసారి సామూహిక గృహప్రవేశాలు

Update: 2025-11-22 02:30 GMT

రా­ష్ట్రం­లో ఇటీ­వ­లే 3లక్ష­ల­కు పైగా పేదల ఇళ్ల ని­ర్మా­ణా­న్ని పూ­ర్తి­చే­సి సా­మూ­హిక గృహ ప్ర­వే­శా­లు చే­యిం­చిన సీఎం చం­ద్ర­బా­బు, రా­ను­న్న మూ­డే­ళ్ల­లో 17 లక్షల ఇళ్ల ని­ర్మా­ణం పూ­ర్తి చే­యా­ల­ని ని­ర్దే­శిం­చా­రు. ఈ లక్ష్య సాధన కోసం తగిన కా­ర్యా­చ­రణ చే­ప­ట్టా­ల­ని ఆదే­శా­లు జారీ చే­శా­రు. లక్ష్యా­ని­కి అను­గు­ణం­గా ఇళ్ల ని­ర్మా­ణా­న్ని పూ­ర్తి­చే­స్తూ.. ఇకపై ప్ర­తి 3నె­ల­ల­కొ­క­సా­రి సా­మూ­హిక గృ­హ­ప్ర­వే­శా­లు చే­యిం­చా­ల­ని స్ప­ష్టం­చే­శా­రు. శు­క్ర­వా­రం రా­ష్ట్ర సచి­వా­ల­యం­లో గృహ ని­ర్మా­ణ­శాఖ, టి­డ్కో అధి­కా­రు­ల­తో ఆయన సమీ­క్ష జరి­పా­రు. ‘అం­ద­రి­కీ ఇళ్లు(హౌ­సిం­గ్‌ ఫర్‌ ఆల్‌) కట్టి­స్తా­మ­ని ఎన్ని­క­ల్లో హామీ ఇచ్చాం. ఈ హా­మీ­ని నె­ర­వే­ర్చే ప్ర­క్రి­య­లో ఇప్ప­టి­కే 3లక్ష­ల­కు పైగా ఇళ్ల­లో సా­మూ­హిక గృహ ప్ర­వే­శా­లు చే­యిం­చాం. ‘హౌ­సిం­గ్‌ ఫర్‌ ఆల్‌’ కా­ర్య­క్ర­మా­న్ని 2029 జన­వ­రి నా­టి­కి పూ­ర్తి­చే­యా­లి. ఉన్న­తా­ధి­కా­రుల నుం­చి ఉద్యో­గుల వరకు అం­ద­రూ బా­ధ్య­త­గా తీ­సు­కో­వా­లి. కూ­ట­మి ప్ర­భు­త్వం వచ్చాక సు­మా­రు 20 లక్షల ఇళ్ల­ను ని­ర్మిం­చా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నాం. మి­గి­లిన 17లక్షల ఇళ్ల­ను వచ్చే మూ­డే­ళ్ల­లో పూ­ర్తి చే­యా­లి. వచ్చే ఉగా­ది నా­టి­కి 5 లక్షల ఇళ్ల­లో సా­మూ­హిక గృహ ప్ర­వే­శా­లు జర­గా­లి. త్వ­ర­లో టి­డ్కో, హౌ­సిం­గ్‌ ఉన్న­తా­ధి­కా­రు­లు, ఉద్యో­గు­లం­ద­రి­తో సమీ­క్ష చే­స్తా­ను’ అని తె­లి­పా­రు. ‘ప్ర­భు­త్వం నె­ర­వే­ర్చా­ల్సిన హామీ హౌ­సిం­గ్‌ ఫర్‌ ఆల్‌. ఈ కా­ర్య­క్ర­మం అమ­లు­లో పొ­ర­పా­ట్లూ జర­గ­కూ­డ­దు.. జా­ప్యం చే­య­కూ­డ­దు. ఇళ్ల ని­ర్మా­ణా­ల­కు సం­బం­ధిం­చి ఉమ్మ­డి కు­టుం­బా­ల­ను ప్రో­త్స­హిం­చే వి­ధం­గా ఇళ్ల ని­ర్మా­ణా­లు చే­ప­ట్టే­లా చూ­డా­లి’ అని సూ­చిం­చా­రు. . ‘అర్హు­లం­ద­రి­కీ ఇళ్ల ని­ర్మా­ణం చే­ప­డ­తా­మ­ని ఎన్ని­క­ల్లో హా­మీ­ని­చ్చాం. 20 లక్షల ఇళ్లు ని­ర్మిం­చా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నాం. ఇప్ప­టి­కే 3 లక్ష­ల­కు పైగా ఇళ్ల­ను పూ­ర్తి­చే­సి లబ్ధి­దా­రు­ల­తో సా­మూ­హిక గృ­హ­ప్ర­వే­శా­లు ని­ర్వ­హిం­చాం. 2029 జన­వ­రి నా­టి­కి మి­గ­తా లక్ష్యా­న్ని వే­గం­గా పూ­ర్తి­చే­యా­లి’ అని సూ­చిం­చా­రు.

ముస్లింలకు అదనంగా రూ.50 వేలు

‘ప్ర­ధా­న­మం­త్రి ఆవా­స్‌ యోజన-1.0 పథకం కింద ని­ర్మా­ణం చే­ప­ట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీ­వీ­టీ­జీ­ల­కు అద­నం­గా ఆర్థి­క­సా­యం అం­ది­స్తు­న్నాం. ఇప్పు­డు ము­స్లిం­ల­కూ రూ.50వేలు అద­నం­గా ఇవ్వా­ల­ని ని­ర్ణ­యిం­చాం. దీ­ని­కో­సం 18వేల మం­ది­కి రూ.90 కో­ట్లు అవ­స­ర­మ­వు­తా­యి. ప్ర­భు­త్వం ఆయా వర్గా­ల­కు అద­నం­గా ఇస్తు­న్న సా­యా­న్ని వా­రి­కి వి­వ­రిం­చా­లి. అర్హు­లం­తా సద్వి­ని­యో­గం చే­సు­కు­నే­లా చూ­డా­లి’ అని వి­వ­రిం­చా­రు.

 వేగంగా లబ్ధిదారుల ఎంపిక సర్వే 

‘ఇళ్ల ని­ర్మాణ పను­ల్లో పొ­ర­పా­ట్ల­కు, జా­ప్యా­ని­కి తా­వి­వ్వ­రా­దు. అర్హుల ఎం­పి­క­కు సర్వే త్వ­ర­గా పూ­ర్తి­చే­యా­లి. వారి జా­బి­తా­ను గ్రా­మా­ల­వా­రీ­గా ప్ర­ద­ర్శిం­చా­లి. ప్ర­జ­లు సం­తృ­ప్తి చెం­ది­తే­నే నాకు సం­తృ­ప్తి. ఇంటి ని­ర్మా­ణా­ని­కి స్థ­లం లే­ని­వా­రి­కి స్థ­లం కే­టా­యిం­చా­లి. తమకు స్థ­లా­లు ఉన్నా­య­ని, అం­దు­లో ని­ర్మిం­చు­కుం­టా­మ­ని చె­బి­తే పొ­సె­ష­న్‌ సర్టి­ఫి­కె­ట్లు అం­దిం­చా­లి. ఇళ్ల ని­ర్మా­ణా­ల­పై అప్‌­డే­ట్ల­న్నీ ఆన్‌­లై­న్‌­లో ఉం­డే­లా చూ­డా­లి’ అని స్ప­ష్టం చే­శా­రు. గత ప్ర­భు­త్వం కక్ష­సా­ధిం­పు­లో భా­గం­గా 2014-19 మధ్య చే­ప­ట్టిన ఎన్టీ­ఆ­ర్‌ రూ­ర­ల్‌ హౌ­సిం­గ్‌ స్కీం­కు సం­బం­ధిం­చిన కొం­ద­రు లబ్ధి­దా­రు­ల­కు బి­ల్లు­లు ని­లి­పి­వే­సిం­ద­ని సీఎం చె­ప్పా రు. రూ.920 కో­ట్ల మేర బి­ల్లు­లు పెం­డిం­గ్‌­లో పడ్డా­య­న్నా­రు. . వీ­టి­ని తి­రి­గి రప్పిం­చేం­దు­కు కేం­ద్రం­తో సం­ప్ర­దిం­పు­లు జర­పా­ల­ని ఆదే­శిం­చా­రు. వా­టి­ని గత ప్ర­భు­త్వం ఏవి­ధం­గా అడ్డు­కుం­దో వి­వ­రిం­చా­ల­న్నా­రు.

Tags:    

Similar News