తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష
అన్నమయ్య భవన్‌లో జరిగిన ఈ హైలెవల్ సెక్యూరిటీ ఆడిట్ సమావేశంలో కొండపై భద్రతా బలోపేతంపై చర్చించారు;
తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. అన్నమయ్య భవన్‌లో జరిగిన ఈ హైలెవల్ సెక్యూరిటీ ఆడిట్ సమావేశంలో కొండపై భద్రతా బలోపేతంపై చర్చించారు. తిరుమలకు పటిష్టమైన భద్రత కోసం అన్ని దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించారు. అంతకుముందు టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తిరుమలలో ఇప్పటికే ఏర్పాటు చేసిన భద్రత, ఇక ముందు మరింత పటిష్టం చేయాల్సిన ప్రదేశాలను వివరించారు.