KUPPAM: బిరబిరా కృష్ణమ్మ పరిగెడుతుంటేను..

నెరవేరిన కుప్పం ప్రజల దీర్ఘకాల స్వప్నం... కుప్పానికి చేరుకున్న కృష్ణమ్మ నీళ్లు.... హంద్రీ-నీవా కాలువలో కృష్ణా జలాలు పరుగులు... కృష్ణ జలాలకు దిగి పూజలు నిర్వహించిన రైతులు;

Update: 2025-08-26 07:00 GMT

కు­ప్పం ప్ర­జల దీ­ర్ఘ­కాల స్వ­ప్నం చి­వ­రి­కి నె­ర­వే­రిం­ది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు ప్రా­తి­ని­ధ్యం వహి­స్తు­న్న కు­ప్పం ని­యో­జ­క­వ­ర్గా­ని­కి కృ­ష్ణ­మ్మ నీ­ళ్లు చే­రా­యి. రైతులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి, సంబరాలు చేసుకున్నారు. కొందరు జంతు బలులిచ్చారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు పడకూడదని హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని రైతులు ప్రశంసించారు. గత ప్రభుత్వంలో జగన్‌.. సినిమా సెట్‌ వేసి కృష్ణా జలాలను కుప్పానికి ఇస్తున్నామని జగన్నాటకం ఆడారని గుర్తుచేశారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కుప్పానికి కృష్టమ్మను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. రానున్న రోజుల్లో స్వర్ణ కుప్పం చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఇప్పటికే పరమసముద్రం చెరువుకు కృష్ణా జలాలు చేరాయి. ఈనెల 30వ తేదీనాటికి చెరువు నిండి మొరవపారి, కింద చెరువు కూడా నిండుతుందని తెలిపారు. అలా నియోజకవర్గంలోని 240 చెరువులు నిండటం ఖాయమన్నారు. 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు.. పరమసముద్రం చెరువు సమీపంలో జలహారతి ఇవ్వనున్నారు. దీని కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. వా­స్త­వా­ని­కి నవం­బ­ర్ నా­టి­కి నీ­ళ్లు తె­స్తా­మ­నే హామీ ఇచ్చిన చం­ద్ర­బా­బు, మూ­డు­నె­లల ముం­దు­గా­నే ఈ వా­గ్దా­నా­న్ని నె­ర­వే­ర్చా­ర­ని స్థా­ని­కు­లు హర్షం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ఎన్నో దశా­బ్దా­లు­గా ఎం­డి­పో­యిన చె­రు­వు­లు తి­రి­గి నిం­డి­పో­తా­య­ని రై­తు­లు ఆనం­దం­గా చె­బు­తు­న్నా­రు. ఈ జలాల రా­క­తో రై­తుల కష్టా­లు తీ­ర­ను­న్నా­యి. మొ­త్తం కు­ప్పం ని­యో­జ­క­వ­ర్గం­లో 554 చె­రు­వు­లు ఉన్నా­యి.

 220.35 కి.మీ.. 16 లిఫ్టులు

కృష్ణా జలాలను తరలించేందుకుగాను హంద్రీ- నీవా ఎత్తిపోతల పథకంలో మొత్తం 38 లిఫ్టులు నిర్మించారు. ఇందులో పుంగనూరు ఉప కాలువలో 16 ఉన్నాయి. లిఫ్టులకు అవసరమైన నిరంతర విద్యుత్తు సరఫరాకు రెండు 220 కె.వి. ఉప కేంద్రాలను నిర్మించారు. బొంతలపల్లె నుంచి ప్రారంభమయ్యే పుంగనూరు ఉప కాలువ 220.35 కి.మీ మేర ప్రవహించి కుప్పం ఉప కాలువలో కలుస్తుంది. పుంగనూరు ఉప కాలువలో లైనింగ్, విస్తరణ పనులకు రూ. 480.22 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు అధికారులు చెబుతున్న ప్రకారం 90 శాతం పనులు పూర్తయ్యాయి. లైనింగ్‌ పనులకు 250 రకాల యంత్రాలు, వాహనాలను వినియోగించారు. 700 మంది కార్మికులు గత నాలుగు నెలలుగా రాత్రింబవళ్లు శ్రమించారు.

Tags:    

Similar News