Sri Lanka Emergency : ఎమర్జెన్సీ ప్రకటించిన శ్రీలంక...!
Sri Lanka Emergency : తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స..;
Sri Lanka Emergency : తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స.. మరోమారు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భద్రతా బలగాలకు పూర్తి అధికారాలు అప్పగించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు వెల్లువెత్తడంతో ఐదు వారాల్లో శ్రీలంకలో గోటబయా ఎమర్జెన్సీ విధించడం ఇది రెండోసారి.
దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా మారడానికి కారణమైన దేశాధ్యక్షుడు గోటబయా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె జరిపాయి. పార్లమెంట్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్, నీటి ఫిరంగులను ప్రయోగించారు.తీవ్రమైన ఆహార కొరత, ఇంధన, ఔషధాల కొరతతో దేశ ప్రజలంతా నెలల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ప్రస్తుత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే కారణం అని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు.