గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా వివేక్ యాదవ్
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా పనిచేసిన వివేక్ యాదవ్‌ను... గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించేందుకు ఎస్‌ఈసీ నిర్ణయించింది.;
గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్‌గా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా పనిచేసిన వివేక్ యాదవ్‌ను... గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించేందుకు ఎస్‌ఈసీ నిర్ణయించింది. అంతకముందు కలెక్టర్‌గా బసంత్ కుమార్ పేరును ఎస్‌ఈసీ ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ప్యానెల్‌లో ఒకరైన వివేక్ యాదవ్ పేరుపై ఎస్‌ఈసీ మొగ్గుచూపింది. వివేక్‌ను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించేందుకు జీఏడీలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రానికి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.