ఎవరి వేడుక వారిదే.. ఎవరి ఉత్సవం వారిదే.. తెలంగాణ అవతరణ వేడుకలకు పొలిటికల్ కలర్ అంటుకుంటోంది.. తెలంగాణ అవతరణ ఉత్సవాలు అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులపాటు కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు దీటుగా ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.. ఇప్పటికే సెప్టెంబరు 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించిన కేంద్రం.. ఇప్పుడు తెలంగాణ అవతరణ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలని ప్లాన్ చేస్తోంది.. జూన్ 2న గోల్కొండ కోటలో ఉత్సవాలు నిర్వహించనుంది.. గోల్కొండ కోటలో పారా మిలటరీ బలగాలు కవాతు చేయనున్నాయి.. జూన్ 2న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.. అయితే, ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు ఎవరొస్తారనే దానిపై క్లారిటీ లేదు.