iPhone 14: ఐఫోన్ 14 @ మేడిన్ ఇండియా.. మరో రెండు నెలల్లో..

iPhone 14: ప్రముఖ యాపిల్ కంపెనీ ఉత్పత్తి ఐఫోన్‌ 14ను దీపావళి నాటికి భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Update: 2022-08-24 11:33 GMT

iPhone14: ప్రముఖ యాపిల్ కంపెనీ ఉత్పత్తి ఐఫోన్‌ 14ను దీపావళి నాటికి భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్లకు భారత్‌లో మార్కెట్ ఎక్కువగా ఉంది. దీంతో డిమాండ్‌ను తీర్చడానికి, ఆపిల్ అధికారికంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో 2 నెలల్లో భారత్‌లో ఐఫోన్ 14ను స్థానికంగా తయారు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఐఫోన్ 14 సిరీస్ వచ్చే నెలలో అధికారికంగా వెలువడుతుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో, కంపెనీ ఈ సంవత్సరం ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్/ఐఫోన్ 14 మినీ, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో సహా నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిసింది.

గతంలో, ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఆలస్యం కావచ్చని చెప్పబడింది. అయితే, గత కొన్ని నెలలుగా ఐఫోన్ మోడల్‌లను సమయానికి విడుదల చేయడానికి సన్నహాలు చేస్తోంది.

ఐఫోన్ మోడల్ 'మేడ్ ఇన్ ఇండియా' కావడం ఇదే మొదటిసారి కాదు. iPhone 11, iPhone SE (2020), iPhone 12 మరియు iPhone 13తో సహా మోడల్‌లు ఇప్పటికే భారతదేశంలో తయారు చేయబడ్డాయి. ప్రస్తుతం, ఐఫోన్‌లను భారతదేశంలో ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ మరియు పెగాట్రాన్‌లతో సహా ముగ్గురు కాంట్రాక్ట్ తయారీదారులు తయారు చేస్తున్నారు.

ఇప్పుడు, ప్రశ్న ఏమిటంటే, ఐఫోన్ 14 భారతదేశంలో తయారు చేయబడితే, ధర ప్రపంచ మార్కెట్ కంటే కొంచెం తక్కువగా ఉంటుందా అంటే దానికి సమాధానం లేదు.

ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో తయారవుతున్న మోడల్స్ ఏవీ స్థానిక తయారీకి ధర తగ్గింపును పొందలేదు. ఉదాహరణకు, ఆపిల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో iPhone 13ని అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. అయినప్పటికీ, ఐఫోన్ 13 ధర లాంచ్ ధరతో సమానం, అంటే రూ.79,900. ఐఫోన్ 14 లాంచ్ అయిన తర్వాత కంపెనీ ఐఫోన్ 13 ధరను అధికారికంగా తగ్గించాలని భావిస్తున్నారు.

అదేవిధంగా, ఐఫోన్ 14 భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడిన తర్వాత దాని ధరను తగ్గించకపోవచ్చు. నివేదికల ప్రకారం, ఐఫోన్ 14 ధర USలో సుమారు $799 మరియు భారతదేశంలో రూ.80,000. అయితే, ఇది తుది ధర కానందున లాంచ్‌లో మార్పులు ఉండవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం రూపాయి విలువ క్షీణత కారణంగా, ఐఫోన్ 14 ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని సూచిస్తున్నాయి.

మొత్తం మీద, భారతదేశంలో ఐఫోన్ 14 తయారీ వినియోగదారులను ప్రభావితం చేయదని తెలుస్తోంది. అయితే, బ్రాండ్ దిగుమతి పన్నును తప్పించుకోగలుగుతుంది.

Tags:    

Similar News