Sergey Brin: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరికి విడాకులు.. నాలుగేళ్ల బంధానికి ఫుల్‌స్టాప్..
Sergey Brin: సర్జీ బ్రిన్.. తన భార్య నికోల్‌తో ఇప్పుడు కాదు డిసెంబర్ 2021లోనే విడిపోయాడట.;
Sergey Brin: ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసుండాలన్న ఆలోచనతోనే వివాహ బంధంలోకి అడుగుపెడతారు. కానీ కొన్నిసార్లు వారు అనుకున్నట్టు ఆ బంధం ఉండకపోవచ్చు. అందుకే వారు విడాకులు అనే నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో సెలబ్రిటీల మధ్య విడాకులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత సంపనుల్లో ఒకరైన ఓ బిజినెస్‌మ్యాన్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్జీ బ్రిన్.. తన భార్య నికోల్ షనాహన్‌కు విడాకులు ఇవ్వబోతున్నాడన్న వార్త సంచలనంగా మారింది. 48 ఏళ్ల సర్జీ బ్రిన్.. ప్రపంచంలోని 10మంది అత్యంత సంపన్నుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. సర్జీ బ్రిన్‌కు, నికోల్ షనాహన్‌కు 2018లో సన్నిహితులు సమక్షంలో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది.
సర్జీ బ్రిన్.. తన భార్య నికోల్‌తో ఇప్పుడు కాదు డిసెంబర్ 2021లోనే విడిపోయాడట. వీరి విడాకుల గురించి అప్పుడే కోర్టులో కూడా ఫైల్ అయ్యిందట. నికోల్ షనాహన్.. బయా ఎకో ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. సర్జీ బ్రిన్.. ముందుగా అన్నె వోజ్సిక్కి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే నికోల్ కారణంగానే వీరిద్దరు 2015లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు సర్జీ.. నికోల్‌తో కూడా విభేధాల కారణంగానే విడాకులు తీసుకుంటున్నట్టు సమాచారం.