Real Market: పెరుగుతున్న ప్లాట్ల ధరలు.. ఆ ఏరియాలో భారీగా..

Real Market: రియల్ ఎస్టేట్ బూమ్ కోవిడ్ వచ్చి కొంత తగ్గిందనుకున్నారు కానీ మళ్లీ మార్కెట్ పుంజుకుంది.

Update: 2022-07-22 10:15 GMT

Real Market: రియల్ ఎస్టేట్ బూమ్ కోవిడ్ వచ్చి కొంత తగ్గిందనుకున్నారు కానీ మళ్లీ మార్కెట్ పుంజుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టు పక్కల ప్రాంతాల్లో ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఒక్క హైదరాబాదులోనే కాదు గత రెండున్నరేళ్లలో ప్లాట్‌ల ధరలు సగటున 38 శాతం పెరిగినట్లు స్థిరాస్తి నిపుణులు వెల్లడించారు.

కరోనా సంక్షోభం తర్వాత ప్లాట్‌లకు గిరాకీ పెరిగిందని ప్రజలు వీటిని పెట్టుబడి సాధనాలుగా చూస్తున్నారని నిపుణులు అంటున్నారు. 2000ల నుంచి ప్లాట్‌ల అభివృద్ధి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణె, ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతం, దిల్లీ-ఎన్‌సీఆర్‌లలో బాగా జరిగింది. హైదరాబాద్‌లో ఘట్‌కేసర్, ఆదిభట్ల, మేడ్చల్‌లో ప్లాట్ సగటు ధరలు వరుసగా 26 శాతం, 21 శాతం వృద్ధి చెందాయి. కోవిడ్ తర్వాత స్థిరాస్థి పెట్టుబడిదారులు ప్లాట్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. 

Tags:    

Similar News