SILVER: "వెండిని ఇప్పుడే కోనేయండి"
మార్కెట్లో వెండి సరఫరా కఠినతరం... USGSలో కీలక లోహంగా వెండి ... విచ్చలవిడిగా పెరిగిన వెండి వినియోగం
ఇటీవలి కాలంలో వెండి ధరలు ఔన్సుకు 50 డాలర్ల కంటే తక్కువ స్థాయిలో స్థిరపడుతున్నప్పటికీ.. దాని వ్యూహాత్మక ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోంది. తన 2025 కీలక ఖనిజాల జాబితాలో వెండిని చేర్చడం వల్ల.. ఈ విలువైన లోహం ఇప్పుడు కేవలం ఆభరణాలకే కాకుండా పారిశ్రామిక, వ్యూహాత్మక లోహంగా కూడా గుర్తింపును పొందింది. వెండి చాలా కాలంగా ప్రెషియస్ మెటల్ గా పరిగణించబడుతుంది. కానీ దాని మొత్తం డిమాండ్‌లో 60 శాతానికి పైగా పారిశ్రామిక వినియోగం వల్ల వస్తోంది. సౌర ప్యానెల్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, బ్యాటరీలు, విద్యుత్ వాహనాల్లో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పారిశ్రామిక వినియోగం పెరుగుతుండటంతో సరఫరా లోటు కూడా తీవ్రమవుతోంది.గత ఐదేళ్లలో వెండి తవ్వకం పెద్దగా పెరగకపోవడంతో పాటు భూగర్భ నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా మార్కెట్లో సరఫరా కఠినవుతూ ధరల స్థిరత్వం దెబ్బతింటోంది.
భౌతిక వెండి కొరత
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన వాణిజ్య యుద్ధాలు, సుంకాలు వెండి మార్కెట్లో అస్థిరతను పెంచాయి. 2025 ప్రారంభంలో అమెరికా ఖజానాల్లో పెద్దమొత్తంలో వెండి నిల్వలు ఏర్పడ్డాయి, ఎందుకంటే ట్రంప్ సుంకాలను విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ భాగస్వాములు భావించారు. అమెరికా నిల్వలు పెరిగినప్పటికీ లండన్ మార్కెట్లో భౌతిక వెండి కొరత ఏర్పడింది. భారతదేశం నుండి పెరిగిన డిమాండ్ కారణంగా లండన్ వాల్ట్‌లలో సరఫరా తగ్గింది. దీని ఫలితంగా, వెండి లీజ్ రేట్లు 34 శాతానికి పైగా పెరిగాయి. స్పాట్ మార్కెట్ ధరలు ఫ్యూచర్స్ కంటే వేగంగా పెరిగాయి. ఇది backwardation అనే అరుదైన మార్కెట్ పరిస్థితిని సృష్టించింది. USGS కొత్త జాబితాలో వెండి, రాగి ,సిలికాన్, పొటాష్, సీసం, రినియం, మెటలర్జికల్ బొగ్గు వంటి పదార్థాలను కీలక లోహాలుగా గుర్తించింది. ఇది అమెరికా ప్రభుత్వానికి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి దారితీస్తుంది. ఈ నిర్ణయం వాణిజ్య పరిమితులను లేదా సుంకాలను కూడా ప్రభావితం చేయవచ్చు, ఎందుకంటే వెండి ఇప్పుడు సంక్షేమాత్మక, వ్యూహాత్మక లోహంగా మారింది.
మెటల్స్ ఫోకస్ సంస్థలో గోల్డ్ & సిల్వర్ డైరెక్టర్ మాథ్యూ పిగ్గోట్ మాట్లాడుతూ.. వెండి మార్కెట్లో పెద్ద స్థాయి అస్థిరత తప్పదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ చాలా బిగుతుగా ఉంది. సరఫరా సమస్యలు తీరకపోతే వెండి ధరల అస్తవ్యస్తత కొనసాగుతుందని ఆయన చెప్పారు. వెండి మార్కెట్లో సరఫరా సమతుల్యం తిరిగి రావాలంటే సరఫరా మిగులు ఏర్పడాలని పిగ్గోట్ అన్నారు. అయితే ప్రస్తుతానికి పారిశ్రామిక వినియోగం తగ్గే సూచనలు కనిపించడం లేదు. వెండి ధరలు పెరగడం సౌర విద్యుత్ రంగానికి కీలక సవాలు అవుతుందని పిగ్గోట్ తెలిపారు. సౌర ప్యానెల్ తయారీలో వెండి సుమారు 15 శాతం ఖర్చు భాగం. ధరలు పెరగడంతో తయారీదారులు వెండి వినియోగాన్ని తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రతి 10 డాలర్ల పెరుగుదల తయారీదారులపై మరింత ఒత్తిడి పెంచుతుంది. దీర్ఘకాలంలో వారు వెండికి ప్రత్యామ్నాయంగా రాగి వైపు మొగ్గు చూపవచ్చని ఆయన చెప్పారు. అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికీ పరీక్ష దశలోనే ఉంది.వెండి ధరలు రాబోయే 24 నెలల్లో పెరిగే అవకాశం ఉంది. ఇది సౌర టెక్నాలజీ పరిణామంపై ఆధారపడి ఉంటుందని పిగ్గోట్ చెప్పారు.