గ్రేట్ రెసిషన్ పొంచి ఉందంటున్న ప్రపంచబ్యాంక్

Update: 2020-10-16 09:08 GMT

1930ల నాటి గ్రేట్‌ డిప్రెషన్‌ తర్వాత అతిపెద్ద రెసిషన్ ప్రపంచం చూస్తోందని ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌ డేవిడ్‌ మల్పాస్‌ అభిప్రాయపడ్డారు. డెవలపింగ్, పూర్ కంట్రీస్ లో కోవిడ్‌-19 పెను ముప్పుగా ప్రమాదకరంగా మారిందన్నారు. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాటు.. ఆయా దేశాలోల ​సంక్షోభం తలెత్తుతుందన్నారు. పేదరికంతో కొట్టుమిట్డాడుతున్న దేశాలను ఇది భారీగా దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌లను సమకూర్చుకోలేని దేశాలకు వ్యాక్సిన్‌లు, మందుల సరఫరా కోసం 1200 కోట్ల డాలర్ల హెల్త్‌ ఎమర్జెన్సీ కార్యక్రమాల విస్తరణకు ప్రపంచ బ్యాంక్‌ బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. 

Tags:    

Similar News