కాసేట్లో కర్నూలుకు కేంద్ర బలగాలు

అవినాష్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. కాసేట్లో కర్నూలుకు కేంద్ర బలగాలు చేరుకోనున్నాయి. శాంతి భద్రతలపై ఎస్పీతో చర్చించారు సీబీఐ అధికారులు. అయితే డీజీపీ సలహా తీసుకుంటామని సీబీఐ అధికారులకు తెలిపారు ఎస్పీ కృష్ణకాంత్‌. అయితే స్ధానిక పోలీసుల నుంచి సీబీఐకి సహకారం లభించక పోవడంతో కేంద్ర బలగాలు వచ్చాకే విశ్వ భారతి ఆస్పత్రికి వెళ్లాలన్న ఆలోచనలో సీబీఐ ఉన్నట్లు సమాచారం. మరోవైపు అవినాష్‌ను లొంగిపొమ్మని కోరగా ఈ నెల 27 తరువాత అందుబాటులో ఉంటానని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టారు అవినాష్‌ తరపు లాయర్లు. అయితే సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణకు నిరాకరించింది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.

అటు కర్నూలులో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ఢిల్లీ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నారు సీబీఐ అధికారులు. ఇక విశ్వభారతి ఆస్పత్రి దగ్గర వైసీపీ శ్రేణులు హైడ్రామా క్రియేట్‌ చేశాయి. ఆస్పత్రి గేటు ముందు ధర్నా చేస్తూ.. ఎవరూ లోపలికి వెళ్లకుండా ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అటు మీడియాపై అవినాష్‌ అనుచరుల దాడికి నిరసనగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆందోళన చేపట్టాయి జర్నలిస్ట్ సంఘాలు.

Update: 2023-05-22 10:57 GMT

Linked news