సీబీఐ ఏం చేయబోతోందనే ఉత్కంఠ
లొంగిపోవాలని అవినాష్ రెడ్డికి చెప్పాలని సీబీఐ అధికారులు ఎస్పీని కలిసిన సమయంలో చెప్పినట్లుగా పోలీసు వర్గాల్లో టాక్ నడుస్తోంది.. శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆయన సీబీఐ బృందానికి చెప్పారు.. దీంతో వారు ఢిల్లీకి ఫోన్ చేసి సెంట్రల్ ఫోర్సెస్ పంపాలని సీబీఐ అధికారులు కోరినట్లుగా చెప్తున్నారు.. సెంట్రల్ ఫోర్సెస్ వస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉండటం, లోకల్ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కేంద్ర బలగాలకు బదులుగా జిల్లా పోలీస్ ఫోర్స్‌తోనే బందోబస్తు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.. అటు ఇప్పటికే విశ్వభారతి ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.. ఈ మొత్తం గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సీబీఐ ఏం చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది.. అయితే, చీకటి పడిన తర్వాత అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.