చనిపోయినవారికి 10లక్షలు ప్రకటించిన కేంద్రం

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. చనిపోయినవారికి 10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి 50వేలు చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. అటు....ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇవాళ అక్కడికి వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం మృతుల కుటుంబాలకు తరుపున 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.

అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించాయి. బాలాసోర్ లోని ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు. అలాగే, బాలేశ్వర్‌లోని వైద్య కళాశాలలు, ఆస్పత్రులను అధికారులు అప్రమత్తం చేశారు.

Update: 2023-06-03 05:07 GMT

Linked news