మలయాల దర్శకుడు మను జేమ్స్ తన తొలి చిత్రం విడుదలకు ముందు రోజే కన్నుమూశారు. దీంతో మలయాల సినీ ఇండస్ట్రీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. మను జేమ్స్ (31) ఫిబ్రవరి 25న కేరళ ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్య క్రియలు ఫిబ్రవరి 26, ఆదివారం మధ్యహ్నం 3గంటలకు జరిగాయి. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం... అతను హైపటైటిస్ తో బాధపడినట్లు చెప్పారు. మను దర్శకత్వం వహించిన నాన్సీ రాణి త్వరలో విడుదల కానుంది.
ఫిబ్రవరి 26న కురవిలంగాడ్ లోని మేజర్ ఆర్కిపిస్కోల్ మార్త్ మరియం ఆర్చ్ డీన్ చర్చిలో మను అంత్యక్రియలు నిర్వహించారు. మను బాలనటుడిగా చిత్రసీయకు పరిచయమయ్యాడని సన్నిహితులు తెలిపారు. మలయాలం, కన్నడ, హిందీ భాషలలో అనేక చిత్రాలలో అసిస్టెంట్, కోడైరెక్టర్ గా పని చేశాడు. మనుకు మళయాల సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.