Vimala Raman : ఆ విలన్‌తో పెళ్ళికి రెడీ అయిపోయిన విమలా రామన్..!
Vimala Raman : తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు విమలా రామన్.. మలయాళీ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించింది.;
Vimala Raman : తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు విమలా రామన్.. మలయాళీ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఈమె వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఎవరైనా ఎపుడైనా సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది.. ఆ తర్వాత కులుమనాలి, రాజ్, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, చట్టం వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుండగా విమలా రామన్ ఇప్పడు పెళ్లికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ హీరో కమ్ విలన్ వినయ్ రాయ్‌తో విమలా పీకల్లోతు ప్రేమలో ఉందని సమాచారం. తరచూ వీళ్లిద్దరూ విహారయాత్రలకు కూడా వెళ్తుంటారు. ఆ మధ్య మాల్దీవులకి వెళ్లిన ఈ జంట అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కానున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దీనిపైన త్వరలో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక వినయ్ రాయ్ విషయానికి వచ్చేసరికి 'ఉన్నాలే ఉన్నాలే' సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యాడు. డాక్టర్, ఈటీ (ఎవరికీ తలవంచడు) చిత్రాల్లో నెగెటివ్ పాత్రలతో మెప్పించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హీరో సూర్య నిర్మిస్తున్న 'ఓ మై డాగ్' సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.