జీరో ప్రమోషన్స్ తో తెలుగులో విడుదలైన తమిళ్ మూవీ పట్టుదల. అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి తమిళ్ లో కూడా మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే తెలుగులో అజిత్ కు పెద్దగా ఫ్యాన్ బేస్ లేదు. దీనికి తోడు ఆ సినిమ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడానికి కూడా ఎవరూ రాలేదు. దీంతో అసలు ఇలాంటి మూవీ ఒకటి విడుదలవుతుందన్న సంగతి కూడా కామన్ ఆడియన్స్ కు తెలియకుండా పోయింది. ఇక ఉన్నంతలో చూసిన వాళ్లంతా అస్సలు వర్కవుట్ కాదు అని తేల్చారు. దీంతో ఆ సినిమాను పట్టించుకున్నవాళ్లే లేకుండా పోయారు. కనీసం తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీంతో తెలుగులో ఈ చిత్రం డిజాస్టర్ గా డిక్లేర్ అయినట్టే అనుకోవచ్చు.
కంటెంట్ పరంగా చూసినా పట్టుదలలో అంత మేటర్ ఏం లేదని తేల్చాయి రివ్యూస్. బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ సినిమాను మక్కీకి మక్కీ దించేశారు. ముఖ్యంగా ఏజ్ బార్ లా కనిపిస్తోన్న అజిత్, త్రిషల ప్రేమకథ బోరింగ్ గా ఉండటం.. అనిరుధ్ పాటలు అస్సలు కనెక్ట్ కాకపోవడంతో పాటు.. ఫస్ట్ హాఫ్ మొత్తం, సెకండ్ హాఫ్ సగం వరకూ హీరో డమ్మీగానే ఉండటం.. అదే పనిగా విలన్స్ చేతిలో తన్నులు తినడం కన్నీళ్లు పెట్టుకోవడం మినహా ఏం చేయలేకపోవడంతో మాస్ ఆడియన్స్ లో ఈ మూవీపై నెగెటివ్ ఫీలింగ్ వచ్చేసింది. అలా మొత్తంగా పట్టుదల తమిళ్ లో కూడా అజిత్ కు బ్యాడ్ రిజల్ట్ నే తెస్తుందంటున్నారు విశ్లేషకులు.