Akkineni Akhil : లెనిన్ గా అఖిల్ అక్కినేని

Update: 2024-12-16 04:59 GMT

హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచీ ఇప్పటి వరకూ సాలిడ్ హిట్ లేని హీరో అక్కినేని అఖిల్. తన ఏజ్ కు తగ్గట్టుగా చాలా ప్రయత్నాలే చేశాడు. ఏజ్ ను దాటి ఎక్స్ పర్మెంట్స్ కూడా చేశాడు. అయినా ఓ బ్లాక్ బస్టర్ పడలేదు. అక్కినేని లెగసీని ముందుకు తీసుకువెళతాడు అనుకున్న హీరో ఆది నుంచి తంటాలు పడుతూనే ఉన్నాడు. కొన్నాళ్లుగా కొత్త సినిమా అప్డేట్స్ లేక ఖాళీగా ఉ్నన అఖిల్ నుంచి తాజాగా మరో మూవీ స్టార్ట్ అయింది.

సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించే ఈ మూవీ భారీ బడ్జెట్ తో ఉండబోతోందని తెలుస్తోంది. శ్రీ లీల హీరోయిన్ గా ఆల్రెడీ ఫిక్స్ అయింది. మురళీ కిశోర్ అబ్బూరు అనే దర్శకుడు ఈ మూవీతో పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవం కూడా జరిగింది. పెద్దగా హడావిడీ లేకుండానే స్టార్ట్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది.

ఇక అఖిల్ కొత్త సినిమాకు 'లెనిన్' అనే టైటిల్ పెట్టబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. లెనిన్ అంటే రష్యన్ సోషలిస్ట్ విప్లవకారుడు. 19వ శతాబ్ధంలో ఈ ప్రపంచాన్ని మార్చిన మార్క్సిస్ట్. అలాంటి గొప్ప యోధుడి పేరు కేవలం సౌండింగ్ బావుందని పెట్టుకుంటున్నారా లేక కథానాయకుడి గమనం కూడా లెనిన్ బాటలో ఉంటుందా అనేది తెలియదు కానీ.. ఇలాంటి టైటిల్స్ ఇప్పుడు బాగా ప్యాషన్ అయిపోయాయి. 

Tags:    

Similar News