తెలంగాణ నేపథ్యంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత కథలు బాగా ఆకట్టుకుంటున్నాయి. రియల్ ఎమోషన్స్ తో మెప్పిస్తున్నారు కొందరు దర్శకులు. ఆ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు చూశాం. తాజాగా బాపు టీజర్ చూస్తే అర్థం అవుతోంది.మరో నేచురల్ కంటెంట్ లా కనిపిస్తోందీ టీజర్ చూస్తే. ఎలాంటి హడావిడీ లేదు. తెలంగాణ సినిమా అనగానే కనిపించే మందు, మాంసం వంటి సన్నివేశాలకు తావు లేదు అన్నట్టుగా ఉంది. పోనీ ఇందులో స్టార్ కాస్ట్ ఏమైనా ఉందా అంటే లేదు.ఒక ప్యూర్ విలేజ్ డ్రామాను చూడబోతున్నాం అనిపించేలా ఉంది టీజర్.
నాలుగైదు జంటలు కూడా కనిపిస్తున్నాయి. ఓ యువజంట.. వయసు దాటుతున్నా.. ప్రేమించి పెళ్లి చేసుకోని జంట.. అలాగే తండ్రి, కొడుకు ఓ జంటగా కనిపిస్తుండటం విశేషం. ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్న సీక్రెట్ లేదా.. వారి సమస్య చుట్టూ రక్తి కట్టే డ్రామా కూడా ఉందని అర్థం అవుతోంది. టీజర్ మొదట్లోనే.. 'లేదు నాయనా నేనే సచ్చిపోతా.. అని కొడుకు అంటే నువ్వెందుకురా సావడం.. నేనే సత్త.. " అనే డైలాగ్ ను బట్టి తండ్రి కొడుకుల కథలో ఓ సంఘర్షణ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ నేపథ్యంలో ఓ మంచి కథ రాబోతోందనే వైబ్స్ ఈ టీజర్ లో కనిపిస్తున్నాయి. కాకపోతే టీజర్స్ బావున్నంత మాత్రాన సినిమా కూడా అలాగే ఉండాలనేం లేదు. బట్ ఈ డైరెక్టర్ డిజప్పాయింట్ చేయడనే అనిపిస్తోంది.ఫిబ్రవరి 21న విడుదల కాబోతోందీ సినిమా.
బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సిహెచ్ రాజు, భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని దయా డైరెక్ట్ చేశాడు.