Aryan Khan Bail: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రానుందా..? ఒకవేళ రాకపోతే మరో 14 రోజులు..

Aryan Khan Bail: షారుక్‌ ఖాన్‌ తనయుడికి ఇవాళ ఎలాగైనా బెయిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు ఆర్యన్‌ ఖాన్‌ తరపు లాయర్లు.

Update: 2021-10-27 03:30 GMT

Aryan Khan Bail (tv5news.in)

Aryan Khan Bail: షారుక్‌ ఖాన్‌ తనయుడికి ఇవాళ ఎలాగైనా బెయిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు ఆర్యన్‌ ఖాన్‌ తరపు లాయర్లు. మధ్యాహ్నం రెండున్నరకు విచారణ జరగనుంది. ఇవాళ గనక బెయిల్‌ రాకపోతే.. ఆర్యన్‌ ఖాన్‌ మరో 14 రోజుల పాటు జైలులోనే ఉండాల్సి వస్తుందని భావిస్తున్నారు. నవంబర్‌ ఒకటి నుంచి ముంబై హైకోర్టుకు దీపావళి సెలవులు మొదలవుతాయి.

తిరిగి నవంబర్‌ 14వ తేదీనే ముంబై హైకోర్టు తెరుచుకుంటుంది. అందుకే, ఆర్యన్‌కు బెయిల్‌ ఇప్పించడమే లక్ష్యంగా ముకుల్‌ రోహత్గీని షారుక్ రంగంలోకి దించినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ NDPS కోర్టు.. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను మూడుసార్లు తిరస్కరించింది. అందుకే షారుక్ ఖాన్‌కు ఉన్న హోప్ మొత్తం ముంబై హైకోర్టు మీదే. ఇవాళ్టి సెషన్‌లో ముకుల్ రోహత్గీ ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇంటర్నేషనల్‌ డ్రగ్స్ ముఠాలతో లింక్ ఉందని ఎన్సీబీ చాలా బంగా వాదిస్తోంది. పైగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నాడు ఆర్యన్‌. ఈ డ్రగ్స్ కేసులో అతనే మూలమని ఎన్సీబీ వాదిస్తోంది. అయితే, ఆర్యన్‌ వద్ద ఎన్సీబీ అధికారులు ఎలాంటి డ్రగ్స్ కనుగొనలేదని అతని లాయర్లు వాదిస్తున్నారు. అయినప్పటికీ, ఈ కేసులో అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగ్‌తో లింక్ ఉందన్న ఎన్సీబీ వాదనలనే కోర్టు కూడా నమ్మింది.

అందుకే, ఆర్యన్‌ ఖాన్‌కు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. ఈ కేసులో ఆర్యన్‌ వాట్సాప్‌ చాటింగ్‌పైనే ఎన్సీబీ ఎక్కువ దృష్టిపెట్టింది. ఇప్పటికే చాటింగ్‌ ఆధారంగా అనన్యపాండేను పిలిపించి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అయితే, అనన్యతో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోల పిల్లలతో కూడా డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్టు ఎన్సీబీ గుర్తించింది.

అయితే, ఆర్యన్‌ఖాన్‌ వాట్సాప్ చాటింగులు ముంబై క్రూయిజ్ పార్టీ కేసుకు సంబంధించినవి కాదని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆ చాటింగ్స్‌ను తప్పుగా డ్రగ్స్ కేసుతో లింకు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోందని ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఆర్యన్ ఖాన్ యువకుడు కాబట్టి అతన్ని జైలుకు కాకుండా పునరావాసానికి పంపాలని ముకుల్ రోహత్గీ వాదించారు. 

Tags:    

Similar News