Balakrishna _ Nani : పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానితో బాలయ్య సందడి.. !
Balakrishna _ Nani : ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికగా ప్రసారమయ్యే‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ అనే షోకి బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.;
Balakrishna _ Nani : ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' వేదికగా ప్రసారమయ్యే'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే షోకి బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి ఎపిసోడ్‌కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అతిధిగా వచ్చారు. ఇక రెండో ఎపిసోడ్ అతిధిగా నాని వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 'సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్' అంటూ నానిని స్టేజీ పైకి పిలవడం ఆసక్తిని కలిగించగా, నాని ఎంట్రీ కూడా అంతే ఆసక్తిని కలిగించింది.
ఆ తర్వాత బాలకృష్ణ-నాని కాసేపు క్రికెట్ ఆడారు. ఇందులో నాని సిక్సర్లు కొడుతుంటే బాలయ్య మాత్రం ఆ రేసులో వెనకబడిపోయారు. . 'ఒత్తిడి తగ్గించుకునేందుకు నువ్వు ఏం చేస్తావ్? ఎలా రిలాక్స్ అవుతావ్' అని బాలకృష్ణ అడగ్గా 'సినిమాలు చూస్తా' అని సమాధానమిచ్చాడు నాని.. 'పులిహోర కబుర్లు చెప్పొద్దు' అంటూ బాలకృష్ణ అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత సినిమాల విడుదల సమయంలో ఎదురుకున్న సమస్యలను నాని బాలయ్యకు చెప్పడం కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్‌ని చూడాలంటే నవంబరు 12 వరకు ఆగాల్సిందే.