Kangana Ranaut : సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన కంగనా రనౌత్
Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు.;
Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు.. ఆదివారం లక్నో లోని యోగి అధికార నివాసంలో ఆమె ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ విషయాన్ని కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
" ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత మహారాజ్ యోగి ఆదిత్యనాథ్ జీని కలుసుకునే గొప్ప అదృష్టం ఈ రోజు నాకు కలిగింది" అని కంగనా రాసుకొచ్చింది. ఈ ఫోటోలలో కంగనా, యోగి ODOP బ్యాగ్‌ని పట్టుకుని కనిపించారు.
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP) అనే కార్యక్రమానికి కంగనా రనౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని గత ఏడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కంగనా ప్రస్తుతం క్యాప్టివిటీ-బేస్డ్ రియాలిటీ షో లాక్ అప్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
ఆమె తదుపరి యాక్షన్ చిత్రం ధాకడ్‌లో ఏజెంట్ అగ్ని పాత్రలో కనిపించనుంది, ఇందులో అర్జున్ రాంపాల్ కూడా నటిస్తున్నారు.