Youth Movie : సందడిగా "యూత్" మూవీ ఫ్రెషర్స్ మీట్

Update: 2026-03-17 07:29 GMT

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ "యూత్". ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న "యూత్" మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ - నో ఏజ్ లిమిట్' అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా ప్రెషర్స్ మీట్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో సందడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ సూర్య బాలాజీ మాట్లాడుతూ - "యూత్" మూవీని సందీప్, వినీత్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఒక మూవీని ఎలా ఆడియెన్స్ కు రీచ్ చేయాలి అనేది సందీప్, వినీత్ ను చూసి తెలుసుకోవాలి. ఈ నెల 19న తమిళంలో యూత్ మూవీని చూద్దాం, అలాగే ఈ నెల 26న తెలుగులో చూసి హిట్ చేద్దాం. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ - ఈ2సీ అంటే మేము రెగ్యులర్ గా చిల్ అయ్యే ప్లేస్, మా గూగుల్ మ్యాప్ లో లొకేషన్ అది. ఈ రోజు ఆ పేరు పోస్టర్ మీద ఉండటం చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఒక పాట పాడాను. వినీత్, సందీప్ కు కంగ్రాంట్స్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ సాయి మార్తండ్ మాట్లాడుతూ - "యూత్" సినిమాను మేమే తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఇంతలో వినీత్, సందీప్ తీసుకున్నారు. కెన్ వర్సటైల్ పర్సన్. యాక్టింగ్, రైటింగ్, లిరిక్స్, సింగింగ్..ఇలా అన్నీ తానే టాప్ క్లాస్ లో చేస్తుంటాడు. నాకు మన మౌళిలా అనిపించాడు. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. సింజిత్ సాంగ్ పాడాడు. ఈ మూవీలోని మీనాక్షిని మా లిటిల్ హార్ట్స్ లో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాం. "యూత్" మూవీ చాలా బాగుంటుంది మీరంతా థియేటర్స్ లో చూడాలని కోరుతున్నా. అన్నారు.

హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ - "యూత్" మూవీ టీజర్ చాలా బాగుంది. నేను సినిమా మొత్తం చూశాను. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మన తెలుగు ఆడియెన్స్ కు బాగా నచ్చుతుంది. మీ అందరినీ పక్కాగా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. మీరంతా తప్పకుండా ఈ నెల 26న యూత్ మూవీ థియేటర్స్ లో చూడండి. వినీత్, సందీప్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరోయిన్ ప్రియాన్షి యాదవ్ మాట్లాడుతూ - "యూత్" మూవీతో తమిళంతో పాటు తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. మా సినిమాను థియేటర్స్ లో మీరంతా చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ - తెలుగు ఆడియెన్స్ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. మా టీమ్ లో దాదాపు అందరం కొత్త వాళ్లమే. మా యంగ్ టీమ్ ను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నేను ఫుడ్ లవర్ గా కనిపిస్తా. నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

అనిష్మ అనిల్ కుమార్ మాట్లాడుతూ - "యూత్" చాలా మంచి మూవీ. తెలుగు ఆడియెన్స్ ముందుకు ఫస్ట్ టైమ్ మేమంతా వస్తున్నాం. మీరంతా థియేటర్స్ లో మా మూవీ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ వినీత్ మాట్లాడుతూ - గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచి "యూత్" మూవీ కంటెంట్ చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఫస్ట్ డీవోపీ సూర్య ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ కు కనెక్ట్ అయ్యాక మేమంతా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్లాం. కెన్ ఈ మూవీని ఎంతో ప్యాషన్ తో రూపొందించాడు. ఈ నెల 19 తమిళనాడు అంతా ఈ సినిమా చూసి సర్ ప్రైజ్ అవుతుంది. ఈ నెల 26న తెలుగులో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు. అన్నారు.

ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ - "యూత్" సినిమా అంతా కెన్ అండ్ గ్యాంగ్ చేసే సందడితో ఎంటర్ టైన్ చేస్తుంది. వీళ్ల గ్యాంగ్ కు ఒక వైబ్ ఉంటుంది. తమిళనాట కెన్ అండ్ గ్యాంగ్ చేసే ఫన్ గురించి అందరికీ తెలుసు. ఈ నెల 26వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణలో కూడా వీళ్ల వైబ్ స్టార్ట్ అవుతుంది. అన్నారు.

లిరిసిస్ట్ సనరే మాట్లాడుతూ - యూత్ సినిమాలో రెండు సాంగ్స్ రాసే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో క్లైమాక్స్ కోసం రాసిన పాట నా మనసుకు ఎంతో దగ్గరైన సాంగ్. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

ప్రొడ్యూసర్ కరుపయ్య మాట్లాడుతూ - తెలుగు ఆడియెన్స్ సినిమాను సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ సెలబ్రేషన్స్ లో మేము భాగం కావాలని యూత్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. సుకుమార్, త్రివిక్రమ్ గారి సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు. మనలోని ఎమోషన్స్ తో ఆకట్టుకునే సినిమాలు తెలుగులో వస్తుంటాయి. అలాంటి కంటెంట్ మా యూత్ మూవీలోనూ ఉంది. అన్నారు.

డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ - యూత్ మూవీ కంటెంట్ లో ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. మంచి మూవీస్ చేసే అందరినీ తెలుగు ఆడియెన్స్ అక్కున చేర్చుకుంటారు. మీ టీమ్ కు కూడా అలాంటి ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి మాట్లాడుతూ - ఇందాక సాయి మార్తండ్ చెప్పినట్లు నేను కూడా మీనాక్షిని మా సుందరకాండ సినిమాలో కాస్టింగ్ చేయాలని అనుకున్నా. ఆమె వేరే మూవీస్ తో బిజీగా ఉన్నారు. యూత్ మూవీ కంటెంట్ చాలా బాగుంది. కెన్ పాడిన సాంగ్ అందరికీ ఇన్ స్టంట్ గా నచ్చింది. మాకు మూవీ నచ్చితే ఏ భాష సినిమా అయినా చూస్తాం. ఈ యూత్ మూవీని కూడా సపోర్ట్ చేద్దాం. అన్నారు.

డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ - యూత్ మూవీ తమిళ టీజర్, సాంగ్స్ రిలీజైనప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నాం. సందీప్, వినీత్ ఫోన్ చేసి ఈ సినిమా తీసుకుంటున్నాం అని చెప్పినప్పుడు మంచి హిట్ అవుతుంది తీసుకోమని చెప్పాను. వాళ్లు ప్రతి సినిమాను ఎంతో ప్యాషన్ తో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తారు. ఈ సినిమా వాళ్లను మరో స్టెప్ పైకి తీసుకెళ్లేలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ - యూత్ సినిమాకు వర్క్ చేసినవాళ్లంతా పాతికేళ్ల వయసు లోపువాళ్లే. ఈ ఏజ్ లోనే ఒక సినిమాకు అన్నీ తామై నిలబడటం మామూలు విషయం కాదు. ఇలాంటి యంగ్ టీమ్ చేసిన సినిమాను సపోర్ట్ చేయమని కోరుతుంటాం. కానీ ఈ మూవీ కంటెంట్ అలా లేదు. ఒక రేంజ్ లో ఉంది. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనిపిస్తోంది. వినీత్, సందీప్ మా రాజావారు రాణిగారు సినిమా టైమ్ నుంచే హౌస్ ఫుల్ డిజిటల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ2సీ బ్యానర్ మీద ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రొడ్యూసర్స్ గా కూడా వాళ్లు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ సూరజ్ వెంజరముడు మాట్లాడుతూ - యూత్ సినిమా యూత్ కు బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇంకా బాగా నచ్చుతుంది. యూత్ రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండే చిత్రమిది. తెలుగు ఆడియెన్స్ థియేటర్స్ లో మా మూవీని చూసి మీ సపోర్ట్ అందించండి. నాకు తెలుగు సినిమాలు, ఇక్కడి స్టార్ హీరోలు, డైరెక్టర్స్ చాలా ఇష్టం. అన్నారు.

డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ - అప్పట్లో చిత్రం లాంటి యూత్ మూవీస్ బాగా ఆదరణ పొందేవి. మధ్యలో అలాంటి యూత్ మూవీస్ తగ్గిపోయాయి. ఇటీవల లిటిల్ హార్ట్స్ తో మళ్లీ ఆ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు ఈ యూత్ మూవీ ఆ ట్రెండ్ ను మరింతగా ముందుగు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. సందీప్, వినీత్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ - యూత్ మూవీ టీజర్, సాంగ్స్ చూసినప్పుడు ఈ సినిమాను తెలుగులో ఎవరు చేస్తారు అనే ఇంట్రెస్ట్ కలిగింది. వినీత్, సందీప్ తాము ఈ మూవీని తీసుకుంటున్నామని చెప్పారు. మూవీ చూపించారు. నాకు మూవీ బాగా నచ్చింది. కెన్ వన్ మ్యాన్ షో లా ఈ సినిమాను అన్నీ తానై చేశాడు. కెన్ అండ్ గ్యాంగ్ అనే క్రెడిట్ ఇచ్చాడు. అంటే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన క్రెడిట్ ఇచ్చినట్లే. ఈ సినిమా ప్రతి పేరెంట్ కు అంకితం అని సినిమా చివరలో వేశాడు. ఎందుకు అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. సూరజ్ తన పర్ ఫార్మెన్స్ తో ఈ సినిమాకు ఒక హీరోలా నిలబడ్డాడు. కెన్ ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. హౌస్ పుల్ సంస్థకు ఈ సినిమాతో హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో, డైరెక్టర్ కెన్ కరునాస్ మాట్లాడుతూ - ఒక చిన్న సినిమాకు సపోర్ట్ దక్కడమే ఈ రోజుల్లో పెద్ద విషయం. మేము చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాం. మీరంతా మాపై చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ కు థ్యాంక్స్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, బిజినెస్ జరుగుతుందా లేదా అనే కొన్ని భయాలు, సందేహాలు మాలో ఉండేవి. ఆ టైమ్ లో లిటిల్ హార్ట్స్ రిలీజై సక్సెస్ అయ్యింది. ఆ మూవీ మాలో కాన్ఫిడెన్స్ నింపింది. లిటిల్ హార్ట్స్ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. డీవోపీ సూర్య అన్న వల్లే తెలుగులో మా మూవీ రిలీజ్ అవుతోంది. సార్ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. మమ్మల్ని నమ్మి యూత్ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్న సందీప్, వినీత్ కు థ్యాంక్స్. ఈ నెల 26న యూత్ సినిమాను థియేటర్స్ లో చూడండి. మీ లైఫ్ లోని స్ట్రెస్ అంతా మర్చిపోతారు. మీ పేరెంట్స్ గురించి ఒక్కసారి మళ్లీ ఆలోచిస్తారు. మా సినిమాది ఎంటర్ టైన్ మెంట్ గోత్రం, యూత్ ను థియేటర్స్ కు తెప్పించే నక్షత్రం. అన్నారు.

Tags:    

Similar News