దగ్గుబాటి వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా వెంటకేష్ తన ఇమేజ్ ను పూర్తిగా దాటేసి చేసిన పాత్ర ఇది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో విపరీతమైన బూతులు, లస్టీ సీన్స్ తో నింపేసిన ఈ సిరీస్ ను వెంకీ చేయడంపైనా కొన్ని విమర్శలు వచ్చాయి. బట్ సీజన్ మాత్రం సూపర్ హిట్ అయింది. అందుకే రానా నాయుడు 2కు రంగం సిద్ధం చేశారు మేకర్స్.
కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసిన ఈ సీరీస్ ను సుందర్ ఆరోన్ ప్రొడ్యూస్ చేశాడు. 2023 మార్చిలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన ఈ సీరీస్ కు సెకండ్ సీజన్ ను రెడీ చేశారు. అది ఈయేడాదే విడుదల కాబోతోందంటూ క్రేజీ అప్డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు రిలీజ్ చేసిన టీజర్ లాంటి వీడియో కూడా ఆకట్టుకుంటోంది. ఈ సారి పర్సనల్స్ ను దాటుకుని యుద్ధం రాబోతోందంటూ చెబుతున్నారు. కాస్టింగ్ ను కూడా బెటర్ చేశారు. మరి ఫస్ట్ పార్ట్ కు వచ్చిన విమర్శల కారణంగానో ఏమో.. ఈ టీజర్ లో ఎలాంటి అసభ్యతా లేకుండా చూసుకున్నారు. మరి టీజర్ వరకేనా.. సిరీస్ కూడా క్లీన్ గానే ఉంటుందా అనేది చూడాలి. మొత్తంగా త్వరలోనే కొత్త సీజన్ రాబోతోందని అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్.