మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ చివరగా మట్కాతో వచ్చాడు. ఈ మూవీలో అతని నటనకు మార్కులు పడ్డాయి కానీ సినిమా పోయింది. అంతకు ముందు కూడా చాలా ఫ్లాపులుున్నాయి అతని ఖాతాలో. మామూలుగా వైవిధ్యమైన కథలతో వచ్చే వరుణ్ ఈ సారి కూడా స్టోరీ మార్చాడు. ఇప్పటి వరకూ తను చేయని జాన్రాతో రాబోతున్నాడు. అదే హారర్ కామెడీ. హారర్ కామెడి ఆడియన్స్ కు కొత్త కాకపోయినా వరుణ్ కు కొత్త. ఇలాంటి కథలు కనెక్ట్ అయితే నవ్విస్తూ భయపెడుతూ కాసులు కొల్లగొట్టేయొచ్చు. యూ వీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందబోతోన్న ఈ చిత్రం గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఇది ‘ఇండో - కొరియన్’ కామెడీ హారర్ సినిమాట. ఇలాంటిది మాత్రం ఇప్పటి వరకూ చూడలేదు. మహా అయితే వేరే భాష దెయ్యాలను చూశాం కానీ.. ఇలా వేరే దేశం దెయ్యాలతో జనాన్ని భయపెట్టాలనుకోవడం కొత్త ఐడియా అనే చెప్పాలి. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయబోతోన్న ఈ ప్రాజెక్ట్ కోసం మెయిన్ టీమ్ ప్రస్తుతం వియత్నాంలో ఉన్నారు. అక్కడే ఫైనల్ స్టోరీ డిస్కషన్స్ పూర్తి చేస్తారట. అలాగే కొన్ని ఎపిక్ లొకేషన్స్ ను కూడా చూస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ మార్చి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందట. వరుణ్ తేజ్ కు ఇది 15వ సినిమా. అందుకే ‘వి.టి 15’అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇక థమన్ సంగీతం చేయబోతున్నాడు.