Dhandoraa : గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన దండోరా, రాజు వెడ్స్ రాంబాయి

Update: 2026-03-07 07:40 GMT

అవార్డ్స్ అంటే అవార్డ్సే. ఒక్కసారి అనౌన్స్ అయితే ఆ మూవీ టీమ్ కు వచ్చే ఆనందం వేరే ఉంటుంది. అలాగే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ విషయంలో ఈ సారి కాస్త క్లారిటీగా ఉన్నారు. ప్రథమ ప్రాధాన్యం తెలంగాణ సినిమాకే ఇచ్చారు అనేలానూ ఉంది. ఈ క్రమంలో దండోరా, రాజు వెడ్స్ రాంబాయి మూవీస్ సత్తా చాటాయి. ఈ రెండు సినిమాలకు వచ్చిన అవార్డ్స్ నిజంగా ఆ మూవీ టీమ్స్ కు మంచి ఊపు నిచ్చేవే.

గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి ఎంపికైంది. అలాగే ఆ మూవీకి బెస్ట డైరెక్టర్ కూడా అవార్డ్ వచ్చింది. ఉత్తమ దర్శకుడుగా సాయిలు ఎంపిక సరైనదే అన్నట్టుగా ఉంది. ఉత్తమ మేల్ యాక్టర్ గా అదే చిత్రంలో నటించిన చైతూ జొన్నలగడ్డను ఎంపిక చేశారు. ఉత్తమ నేపథ్య గాయకుడుగా అనునాగ్ కి రాజు వెడ్స్ రాంబాయి సెలెక్ట్ అయ్యాడు. మొత్తంగా ఈ మూవీకి నాలుగు అవార్డ్స్ రావడం సంతోషమే.

ఇక తర్వాతి స్థానంలో దండోరా మూవీ నిలబడింది. ఈ మూవీకి ద్వీతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ సపోర్టింగ్ నటుడుగా అదే చిత్రానికి శివాజీ అవార్డ్ వచ్చింది. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ కూడా దండోరాకే దక్కింది. మొత్తంగా ఈ మూడు విభాగాల్లో అవార్డులు సాధించింది దండోరా మూవీ. ఈ ఎంపికల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనిపించేలా ఉన్నాయి.

వీటితో పాటు ఛాంపియన్ మూవీకి సైతం ఐదు అవార్డ్స్ దక్కాయి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ను ఉత్తమ నటుడుగా రోషన్ సెలెక్ట్ అయ్యాడు. అలాగే బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీకి పీటర్ హెయిన్స్, బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ విభాగంలో ఆట సందీప్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్ గా చంద్రకాంత్ సోనవాలి, అజయ్ కుమార్ ఎంపికయ్యారు. ఓ రకంగా ఈ మూవీకి కమర్షియల్ గా పెద్ద విజయం రాలేకపోయినా.. అవార్డుల్లో మాత్రం సత్త చాటింది. 

Tags:    

Similar News