Shankar Game Changer : గేమ్ ఛేంజర్ 4 పాటల బడ్జెట్ ఎంతో తెలుసా..?

Update: 2025-01-02 08:45 GMT

కొందరు దర్శకులకు తెరంతా కాస్ట్ లీగా కనిపించాలనే ఆరాటం ఉంటుంది. అందుకోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా వినిపించే పేరు డైరెక్టర్ శంకర్ ది. తన పాటల బడ్జెట్స్ తో మీడియం రేంజ్ మూవీస్ నే ప్రొడ్యూస్ చేయొచ్చు అని ఆరంభం నుంచీ అనిపించుకుంటూనే ఉన్నాడు. ప్యాన్ ఇండియా మార్కెట్ లేని టైమ్ లోనే అతను అత్యంత భారీగా ఖర్చు చేయించేవాడు. నిజానికి ఆ పాటలు లావిష్ గా కనిపించినా.. కథకు పెద్దగా ఉపయోగపడేవేం కాదు. అయినా శంకర్ కు అదో ఆనందం. అలాగే ఈ సారి గేమ్ ఛేంజర్ కోసం కూడా నిర్మాత దిల్ రాజుతో అంతే భారీగా ఖర్చు చేయించాడట. ఇందులోని నాలుగు పాటలకు శంకర్ పెట్టించిన బడ్జెట్ ఎంతో తెలుసా. 75 కోట్లు. యస్.. అక్షరాలా 75 కోట్లు.

గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకూ నాలుగు పాటలు విడుదలయ్యాయి. ఒక్కోటీ ఒక్కో స్టైల్ లో కనిపించాయి. జరగండి జరగండి అనే పాట చూస్తే అది త్రీ డీ ఎఫెక్ట్ రేంజ్ లో తెరపై కనిపిస్తుందని చెప్పాడు థమన్. మిగతా పాటలూ అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఒక సాంగ్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్ స్టేట్ లోని ఫోక్ స్టైల్ ను ఫాలో అవుతూ రెండు భాషల జానపద కళాకారులను రప్పించి రా మచ్చా రా అనే భారీ పాటను రూపొందించారు. నానా హైరానా, ధోప్ సాంగ్ కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఎలా చూసినా ప్రతి పాటలోనూ భారీ బడ్జెట్ కనిపిస్తోందనేది అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు 75 కోట్లు అంటే ఆశ్చర్యం ఏముందీ..? అనేది శంకర్ ఫ్యాన్స్ చెప్పుకునే మాట.

ఎలా చూసినా ఈ మధ్య కాలంలో కేవలం పాటలే ఇంత బడ్జెట్ ఖర్చు చేసిన తెలుగు సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. పాటలు వినబుల్ గా, చూడబుల్ గా ఉంటే చాలు.. కానీ కాస్ట్ లీగా ఉంటే సినిమాకు అదనంగా కలిసొచ్చేదేంటీ అని అడగొద్దు.. భారతీయుడు సినిమాలో పాటలకోసమే గ్రాఫిక్స్ వాడిన దర్శకుడు శంకర్. అందుకే అతని పాటలూ, అతనూ అంతే అనుకోవాలి. 

Tags:    

Similar News