Bhairavam : భైరవం నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్

Update: 2025-05-11 10:22 GMT

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తోన్న సినిమా ‘భైరవం’. గతేడాది తమిళ్ లో విడుదలై విజయం సాధించిన గరుడన్ అనే చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ పాట విడుదలైంది. ఇది ముగ్గురు స్నేహితుల మధ్య వచ్చే గీతం. మంచి హుషారుగా ఉందీ పాట. మూడు ప్రధాన పాత్రల క్యారెక్టర్స్ ను కూడా తెలిపేలా సాహిత్యం కనిపిస్తోంది. మనోజ్ రాముడైతే, అతని సోదరుడు లక్ష్మణుడు లాంటి పాత్రలో రోహిత్ ఉంటాడని.. వీరిని కాచుకుని నిత్యం అండగా నిలిచేలా శ్రీనివాస్ పాత్ర ఉండబోతోందని అర్థం అవుతోంది.

సంక్రాంతి పండగ సమయంలో సాగే గీతంలా ఉంది. వీరితో పాటు మనోజ్, రోహిత్ ల జోడీలైన ఆనంది, దివ్యా పిళ్లైతో పాటు జయసుధ ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఈ పాట టైమ్ కు శ్రీనివాస్ కు ఇంకా జోడీ దొరకదు సినిమాలో అనుకోవచ్చు. అతనికి జోడీగా అదితి శంకర్ కనిపించబోతోందని ఆల్రెడీ వచ్చిన పాటలో తేలిపోయింది.

శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాటను భాస్కర భట్ల రాయగా రేవంత్, సాహితి చాగంటి, సౌజన్య భాగవతుల ఆలపించారు. ఇక ఈ చిత్రాన్ని ఈ  నెల ౩౦న విడదల చేయబోతున్నారు. 

Full View

Tags:    

Similar News