పుష్ప 2.. ప్రస్తుతం ఇండియాలో సంచలనం సృష్టిస్తోన్న మూవీ. 14 రోజుల్లోనే 1500 కోట్లు కొల్లగొట్టింది. ఇందులో మేజర్ షేర్ నార్త్ బెల్ట్ నుంచి ఉండటం విశేషం. అక్కడ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది పుష్ప 2. అల్లు అర్జున్ నయా ప్యాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. అతనికి మాస్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఓ కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసిందీ మూవీ. అలాగే టాలీవుడ్ లో సరికొత్త టార్గెట్స్ కూడా సెట్ అయ్యాయి. ఇప్పటి వరకూ నాన్ బాహుబలి అనే మాట్లాడుకున్నారు. ఇక నుంచి నాన్ పుష్ప 2 అని మాట్లాడుకోవాల్సి ఉంటుందనేది సత్యం.
అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, రష్మిక, ఫహాద్ ఫాజిల్ నటన సుకుమార డైరెక్షన్ సినిమాను నెక్ట్స్ లెవల్ లో నిలిపాయి. అయితే ఈ మూవీ నిడివి 3 గంటల 20 నిమిషాలు. చాలామంది చాలా ఎక్కువ అనేశారు. అయినా చూశారు. మరి వీరి ధైర్యం ఏంటో కానీ ఇప్పుడు మరో 18 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేయబోతున్నారు. గతంలో ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని సీన్స్ ను మళ్లీ కలుపుతున్నారు. అంటే 3 గంటల 38 నిమిషాలవుతుంది. మరి 18 నిమిషాల కోసం ఆడియన్స్ మళ్లీ థియేటర్స్ కు వస్తారా అనేది పక్కన పెడితే ఇదేం రూమర్ కాదు. నిజంగానే ఈ నెల 25నుంచి ఆ ఎక్స్ ట్రా ఫుటేజ్ ను యాడ్ చేస్తున్నారు. నిజంగా ఇది నార్త్ లో బాగా కలిసొచ్చే స్ట్రాటజీ అనే చెప్పాలి. ఏదేమైనా పుష్ప రాజ్ రూలింగ్ మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేదక్కడ.