పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టింది. చాలా యేళ్ల తర్వాత పవన్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ కావడంతో ఫ్యాన్స్ కు ఈ మూవీ అంటే ఒక ఎమోషన్. కావడానికి బాలీవుడ్ దబాంగ్ కు రీమేక్ అయినా.. తెలుగులో చాలా మార్పులు చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. అవి పూర్తిగా పవన్ ఇమేజ్ కు అచ్చు గుద్దినట్టు సరిపోయాయి. హిలేరియస్ కామెడీతో పాటు అద్భుతమైన లవ్, ఎమోషనల్ టచెస్ అలాగే మెలోడిస్ మ్యూజిక్, పర్ఫెక్ట్ యాక్షన్.. ఇలా ఓ కంప్లీట్ కమర్షియల్ సినిమా ప్యాకేజ్ కు తగ్గట్టు అన్నీ తూకం వేసినట్టుగా కరెక్ట్ గా సెట్ అయ్యాయి. అందుకే గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశాడు.
ఫ్యాన్స్ అంటేనే హీరోలు ఏం చేసినా హ్యాపీగా ఫీలవుతారు. అందుకే రీ రిలీజ్ టైమ్ లో అంత హడావిడీ చేస్తుంటారు. మరి గబ్బర్ సింగ్ లాంటి ఎమోషనల్ టచ్ ఉన్న మూవీని రీ రిలీజ్ చేస్తే ఊరుకుంటారా.. మరోసారి బ్లాక్ బస్టర్ చేశారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ ఏకంగా 6 కోట్లకు పైగా వసూలు చేసి రీ రిలీజ్ లోనూ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసింది.
గబ్బర్ సింగ్ దేశవ్యాప్తంగా 1850కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కర్ణాటకలో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. ఇప్పుడన్న అంచనాలు ప్రకారం మరో రెండు కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందంటున్నారు. ఏదేమైనా ఈ మూవీకి పవన్ తో పాటు శ్రుతి హాసన్, దేవీ శ్రీ ప్రసాద్ మరో ఎసెట్ గా నిలిచారనే చెప్పాలి. ఇక హరీష్ శంకర్ రీమేక్ ల ఎక్స్ పర్ట్ అని గబ్బర్ సింగ్ తోనే పేరొచ్చింది.